Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పొగరుబోతు శ్రియకి బెస్ట్ అవార్డ్!
సినిమాలో నటించే పాత్రను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటానంటుంది శ్రియ. ప్రస్తుతం సినిమాలు లేక రెమ్యూనరేషన్ తగ్గించుకుని నటిస్తున్నానంటున్నది. అసలు అందులో వాస్తవం లేదంటుంది శ్రియ. నాకు పాత్ర నచ్చితే అసలు డబ్బులు తీసుకోకుండా నటిస్తానంటూ ఇటీవల మాతృభూమి పత్రిక ప్రతి సంవత్సరం ఇచ్చే ఉత్తమనటి అవార్డుకు ఎంపికైన శ్రియ తెలియజేస్తోంది. పిస్తా, మల్లన్న చిత్రాల్లో చేసిన నటనకు గానూ శ్రియ బెస్ట్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ విషయం తెలుసుకున్న శ్రియ ఆనందపడుతూ నిజంగా ఇటువంటి వార్తలు ఒక కప్పు బూస్ట్ అంత బలాన్నిస్తాయంటుంది. అసలు హీరోయిన్ లకు సంతోషం కలిగేది, ఇటువంటి అవార్డులు వచ్చినప్పుడే..లేదా చేసిన పాత్రను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకుని బాగా చేసింది అన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది అంటుంది. ఇటువంటి మాటలు విన్నప్పుడు ఆ చిత్రంలో ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని మర్చిపోతాము మళ్లీ వారికి నచ్చిన పాత్ర చేయాలని మాకు అనిపిస్తుంది. అంటూ తనను ఆ అవార్డుకు ఎంపిక చేసిన పత్రికకు కతజ్ఝతలు తెలుపుకుంటోంది శ్రియ.
కానీ ఈ రెండు సినిమాల్లో ఏమి నటించిందని ఆమెకీ అవార్డు ఇచ్చారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలావున్నాసినిమాలు లేక దారి తోచని పరిస్థితిలో ఉన్న శ్రియ ఈ అవార్డు ద్వారా దర్శకనిర్మాతల కళ్లలో పడి మళ్ళీ సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటుందో లేదో చూడాలి! అంటున్నారు విమర్శకులు.