శివాజీ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన శ్రియాపై చెన్నైలోని ఒక స్థానిక హిందు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాజీ చిత్రం 175 రోజుల సంబరాల సందర్భంగా ధరించిన దుస్తులను తప్పు పడుతూ ఆ సంస్థ శ్రియాపై ఫిర్యాదు చేసింది. శ్రియా ధరించిన దుస్తులు హిందూ సంప్రదాయాన్ని కించపరిచేవిగా ఉన్నాయని హిందూ మక్కల్ కచ్చి (హెచ్ ఎంకె) అనే సంస్థ ఈ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంబరాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూడా పాల్గొని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మెమెంటోలు ప్రదానం చేశారు. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురైన రెండో తార శ్రియా. ఇంతకు ముందు కుష్బూ ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కుంది.