5 నగరాల్లో శ్రీయ ‘పవిత్ర’ ఆడియో రిలీజ్
హైదరాబాద్: హీరోయిన్ శ్రియ తాజాగా 'పవిత్ర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె వేశ్య పాత్ర పోషిస్తుంది. జనార్ధన మహర్షి దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఆడియో రిలీజ్ కు సిద్దం అవుతోంది. సినిమాకు ప్రచారం కల్పించడంలో భాగంగా వినూత్న రీతిలో ఆడియో రిలీజ్ ప్లాన్ చేసారు.
ఆడియో విడుదల కార్యక్రమం రెండు రోజుల పాటు 5 నగరాల్లో నిర్వహించేందుక ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో రాష్ట్రంలోని ప్రధానమైన ఐదు నగరాల్లో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రియ మోడ్రన్ వేశ్య(కాల్ గర్ల్) గా కనిపించనుంది.

సినిమా గురించి శ్రియ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ... నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సాయి కుమార్, రోజాలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని వెల్లడించింది.
దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు నేను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర పాత్రకు శ్రియ పర్ ఫెక్ట్ మ్యాచ్. సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింప చేస్తాయి. ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం: జనార్ధన మహర్షి.


Click it and Unblock the Notifications











