చిరంజీవి స్క్రీన్ మేనకోడలు గ్లామరస్‌ లుక్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: తొమ్మిదేళ్ల క్రితం చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ' చిత్రం గుర్తుందా. ఈ సినిమాలో చిరంజీవి తన మేన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గన్ స్మగ్లింగ్ కి చెందిన వాడిలో ఒకడు సైలెంట్ గన్ సౌండ్ రాకుండా ఎలా పనిచేస్తుందో పరిక్షించడం కోసం చిరంజీవి మేనకోడలు మీద గురి ఎంచుకుంటాడు. బుల్లెట్ తగిలి పాప చనిపోతుంది. తన మేనకోడల్ని చంపిన వారిని వెతికి పట్టుకుని చిరంజీవి వాళ్ళని అంతం చెయ్యడంతో సినిమా కూడా అంతం అవుతుంది.

ఈ చిత్రంలో చిరంజీవి మేనకోడలిగా చైల్డ్ ఆర్టిస్టు పాత్రలో నటించింది శ్రేయా శర్మ. ఈ చైల్డ్ ఆర్టిస్టు ఇపుడు పెద్దయి హీరోయిన్‌గా మారింది. త్వరలో తెలుగులో ‘గాయకుడు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి సినిమాలోనే గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

‘గాయకుడు' చిత్రానికి కమల్ జి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో ధీరు ఫిలింస్‌ పతాకంపై సిద్ధాన్స్‌ హీరోగా, శ్రేయా శర్మ హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కమల్‌ జి. దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్‌ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకులు కోటి తనయుడు రోషన్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన ఫోటోలు....

శ్రేయా శర్మ

శ్రేయా శర్మ

‘గాయకుడు' చిత్రంలో సిద్ధాన్స్, శ్రేయా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంగీత నేపథ్యంలో యూత్ ఫుల్

సంగీత నేపథ్యంలో యూత్ ఫుల్

‘గాయకుడు' సినిమా సంగీత నేపథ్యంలో యూత్ ఫుల్ గా సాగుతుందని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు

నటీనటులు

సిద్ధాన్స్‌, శ్రేయా శర్మ, సంతోష్‌ పవన్‌, ఎం.ఎస్‌.నారాయణ, సప్తగిరి, గురుచరణ్‌, పార్వతి, మాస్టర్‌ ధీరజ్‌, బేబి యోధ, విష్ణుప్రియ, జీవన్‌, రాకేష్‌, భాస్కర్‌ తదితరులు నటిస్తున్నారు.

ఇతర విషయాలు

ఇతర విషయాలు

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: కొల్లి దుర్గాప్రసాద్‌, కథ: గుడ్డపాతల వెంకాయమ్మ, మాటలు: కరుణాకర్‌ గోపిని, మోహిత్‌ భరద్వాజ, పాటలు: చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌, డాన్స్‌: జోసఫ్‌ ప్రకాష్‌, వంశీ, ఎడిటింగ్‌: ఉద్దవ్‌ ఎస్‌.బి., ఆర్ట్‌: రామ్‌చందర్‌సింగ్‌, కో-డైరెక్టర్‌: డౌలూరి నారాయణ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.ఎన్‌.నందమ్‌, త: జమ్మలమడుగు రవీంద్రనాథ్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కమల్‌ జి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X