త్రిషకే కాదు ...శ్రియకు ఛాన్సిచ్చాడు

ప్రస్తుతం హీరోయిన్లు త్రిష,శ్రియ మధ్య పోటీ హోరా హోరీగా నడుస్తోందన్న సంగతి తెలిసిందే. దాంతో సహజంగా వీరిద్దరూ కమల్ మర్మయోగి చిత్రానికి పోటీ పడ్డారు. అయితే త్రిష తన టాలెంటుతో అవకాశాన్ని గద్దలా తన్నుకు పోయింది. దాంతో డైలమాలో పడ్డ శ్రియకు కమల్ న్యాయమే చేసాడంటున్నారు. ఓదార్చటానికే ఆమెకూ తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారుట. అయితే శ్రియ మొదట దాన్ని తిరస్కరించిందిట.
అయితే కమల్ ఏం చెప్పాడో ఏమో గానీ వెంటనే శ్రియ దాన్ని ఓకె చేసి సైన్ చేసేసిందిట. అడ్వాన్స్ రెమ్యునేషన్ వంటివి కూడా అడగలేదుట. దాంతో అంతా కమల్ ని వాహ్ కమాల్ అన్నట్లు చూసారుట. ఇక ఈ సినిమాకోసం హేమమాలిని కూడా చిర కాల విరామం తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనుంది. అలాగే ఈ సినిమాకి కెమెరా కోసం హాలీవుడ్ నుండి నిపుణులను రప్పించేపనిలో కమల్ ఉన్నాడుట. అక్టోబర్ 19 న ముంబయి లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. అలాగే అదే నెలాఖరులో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











