శ్రియా ఎదురుచూపులు
హాలీవుడ్ లో అవకాశం వచ్చిన శ్రియా తొలుత తమిళ దర్శకులకు డేట్స్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇపుడు శ్రియా మనసు మార్చుకున్నట్టుంది. అజిత్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఆసక్తిని కనపరుస్తోంది. తన దర్శకత్వంలో రూపొందనున్న అక్బర్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి శ్రియను కొద్దివారాల క్రితమే రాజుసుందరం సంప్రదించినట్టు తెలుస్తోంది. తాను ఇపుడు డేట్స్ సమస్యను ఎదుర్కొంటున్నానని, కొంతకాలం ఆగాలని శ్రియ, రాజు సుందరంకు చెప్పినట్టు తమిళ పత్రికలు రాసాయి. తాజాగా శ్రియా దీనిని నిర్ద్వందంగా ఖండించింది.....ఆ వార్తలో ఎంతమాత్రం నిజంలేదు....నేను ఆ అవకాశాన్ని నిరాకరించానని వచ్చిన వార్తలో ఎంతమాత్రం నిజం లేదు....ఈ సినిమా కోసం రాజు సుందరం మూడు గంటలపాటు కథను చెప్పారు...కథ చెప్పే విధానానికి ముగ్దురాలినయ్యాను...అయితే ప్రస్తుతం అశోక్ అమృత్ రాజ్ హాలీవుడ్ సినిమాకోసం కమిట్ అయ్యాను...విక్రమ్ తో కండసామి సినిమా ఉంది...కొన్ని హిందీ సినిమాలు కూడా ఉన్నాయి...అందుకే వెంటనే ఓకే చేయలేకపోయాను...అందుకే మూడు నెలలు ఆగాలని రాజు సుందరాన్ని రిక్వెస్ట్ చేశాను... అయితే రాజు సుందరం ఇంకా ఏమీ చెప్పలేదు..ఆయన సమాధానం కోసం వేచి చూస్తున్నాను..స్క్రిప్ట్ బాగా నచ్చింది..అజిత్ తో సినిమా చేయడం నిజంగా అదృష్టం..అంది.


Click it and Unblock the Notifications











