మొన్న మీనా మ్యారేజ్ లో మీడియాతో గొడవ జరిగినట్లుగానే అలాంటిదే శ్రియ శ్రీకాళహస్తి విజిట్ లోనూ చోటు చేసుకుంది. శ్రియ శ్రీవారిని సందర్శించుకోవటానికి తిరుపతి వెళ్ళింది. అనంతరం శ్రీకాళహస్తికి ప్రయాణం పెట్టుకుంది. అయితే శ్రియ సెలబ్రేటి,న్యూస్ సేలబులటి ఉన్న స్టార్ కావటంతో మీడియావారు ఆమె వెనక పడ్డారు. అయితే తాను మానసిక ప్రశాంతత కోసం ఇక్కడకు వచ్చానని,ఇది తన పర్శనల్ టూర్ అని శ్రియ వారిపై మండిపడింది. తను కేవలం దైవ సన్నిధిలో పూజకే వచ్చానంటూ కెమెరాలు తీయవద్దంటూ గొడవకు దిగింది. అయితే కొందరు మీడియా వ్యక్తులు ఆమె వద్దని వారిస్తున్న వెంట పడుతుంచే చివరకు అసహనంతో రంకెలేసింది. ఆమె తల్లి సైతం మీడియా పై విరుచుకుపడింది. చివరకు ఫోటోలు తీస్తున్న కెమెరామన్ పై కలబడి కెమెరా లాక్కోడానికి సిద్ధపడింది. ఈ ఆలయానికి గతంలో వచ్చినప్పుడు కూడా శ్రియ ఇలానే చిందులేసిందని మీడియా వారు ఆందోళనకు దిగారు.
Story first published: Sunday, July 19, 2009, 17:53 [IST]