»   » శ్రేయస్ మీడియా వారి ‘యస్’ మూవీ ఫస్ట్ లుక్ (ఫోటో)

శ్రేయస్ మీడియా వారి ‘యస్’ మూవీ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినూత్నంగా సినిమా ప్రచారాలు చేస్తూ సౌత్ ఇండియాలో చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు అందరి చేత ప్రశంసలు పొందుతున్న సౌతిండియా నెం.1 ప్రచార సంస్థ శ్రేయాస్ మీడియా సమర్పణలో దేవాస్ ఎంటర్టెన్మెంట్ మరియు హ్యాపీ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో నూతన దర్శకుడు రజినీ తనయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రేమకే అర్థం చెప్పే ఓ సరికొత్త ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టెనర్ 'యస్'.

Shreyas Media's movie YES first look

ఈ చిత్రంలో అభిరామ్, శృతి రాజ్‌లు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు రజనీ తనయ్ మాట్లాడుతూ....నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఓ సరికొత్త ప్రేమ కథని శ్రేయాస్ మీడియా నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిస్తున్నాం అన్నారు.

హీరో హీరోయిన్లు కొత్త వారైనప్పటికీ చాలా బాగా చేస్తున్నారు. ఇంద్రగంటి సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువనుంది. గొట్టిపాటి హరీష్ కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలిపారు. నిర్మాణ సంస్థ: శ్రేయాస్ మీడియా, బ్యానర్: దేవాస్ ఎంటర్టెన్మెంట్, హ్యాపీ సినిమాస్, నిర్మాతలు: శ్యామ్, గుడ్ ఫ్రెండ్స్, సంగీతం: ఇంద్రగంటి లక్ష్మీ శ్రీనివాస్, కెమెరా: గొట్టిపాటి హరీష్, పాటలు: చంద్రబోస్, సాహితి, రహమాన్, కరుణాకర్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్: రజనీ తనయ్.

English summary
South India’s no.1 Movie Promotional Company Shreyas Media has joined Devas Entertainment and Happy Cinemas in making a youthful entertainer titled ‘Yes’. Rajini Tanay is getting introduced as Director with this flick. Abhiram and Shruti Raj are playing as its lead. Film has finished 50%of its shoot and is out with first look today on account of Sri Rama Navami.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu