ఆ చేదు అనుభవం కేవలం రూమర్: శ్రియ
బాలీవుడ్ లో నాకు చేదు అనుభవం ఎదురైందని, హిందీ సినిమాలకు నేను స్వస్తి చెప్పినట్టే అని ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. అందులో ఏ మాత్రం నిజంలేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది శ్రియ. అలాగే బాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదు. ఇకపోతే... నాకు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది తెలుగు సినిమానే. అలాంటి తెలుగు సినిమాకు దూరమై నేను ఓ విధంగా తప్పే చేశా. ఆ తప్పును 'డాన్ శీను' ద్వారా దిద్దుకుంటున్నా. ఇక నుంచి తెలుగుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల నుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది శ్రియ.'భగీరథ' తర్వాత రవితేజతో శ్రియ చేస్తున్న సినిమా ఇది. ఇక శ్రియ ప్రస్తుతం కొమురం పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











