అల్లరి నరేష్ నేనూ ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి: శ్రియ
నరేష్, శర్వానంద్, నేనూ ఒకే ఏజ్ గ్రూప్‌వాళ్లం. కావున వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు తొలినుంచీ చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తారతమ్యాలు లేవు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్లతో చేస్తున్నప్పుడే చిన్న హీరోలతో కూడా నటించాను అంది శ్రియ. ఆమె తాజా చిత్రం 'నువ్వా-నేనా'. అల్లరి నరేష్, శర్వానంద్, శ్రీయ ప్రధాన పాత్రధారులుగా నారాయణ దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం 'నువ్వా-నేనా' క్రిందటి శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా గురించి శ్రీయ మీడియాతో మాట్లాడుతూ అలా స్పందించింది.
అలాగే... నేను ప్రేక్షకురాలిగానే ఈ సినిమా చూశాను. ఇది నైస్ పాప్‌కార్న్ మూవీ. థ్రిల్లింగ్ కామెడీ ఫిలిం. చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. నాకు స్వతహాగా రొమాంటిక్ పాత్రలన్నా, కామెడీ పాత్రలన్నా, భావోద్వేగపూరిత పాత్రలన్నా చాలా ఇష్టం. ఒక్క కామెడీ తప్ప మిగిలిన తరహా పాత్రలన్నీ ఇంతకుముందు చేశాను. ఈ సినిమాతో ఆ అవకాశం చిక్కింది. దర్శకుడు నారాయణ మంచి అభిరుచి గల వ్యక్తి. తను ఈ సినిమాను నడిపిన విధానం నాకు బాగా నచ్చింది అంది. రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ.. 'మిడ్ నైట్ చిల్డ్రన్స్' అనే సినిమాలో నటిస్తున్నాను. అది ఇంగ్లీష్ చిత్రం. ఆ సినిమా కోసం ఆరు నెలలుగా హోమ్ వర్క్ జరుగుతోంది. ఆ సినిమా బిజీ వల్లనే తెలుగు, తమిళ చిత్రాలపై ఎక్కువ ఏకాగ్రత చూపలేకపోయాను. త్వరలోనే మరో తెలుగు సినిమా చేయబోతున్నాను'' అన్నారు. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అనడిగిన ప్రశ్నకు- ''అది ప్రస్తుతానికి సస్పెన్స్'' అని నవ్వుతూ తేల్చేసింది.


Click it and Unblock the Notifications











