సినిమాపోయే...ఆఫరూ పోయే..మందుకు భానిసాయే...!?
శ్రియ నటించిన తమిళ చిత్రం 'రౌద్రం" ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇకపై కోలీవుడ్ లో తన కెరియర్ ఊపందుకోవడం కష్టమని శ్రియ డిసైడ్ అయ్యిందట. దాంతో చెన్నైలోని వలసరవాక్కంలో వున్న తన బంగ్లాను శ్రియ వెకేట్ చేసిందని సమాచారం. చెన్నైలో ఉండే కంటే ముంబాయ్ లోగానీ, హైదరాబాద్ లోగానీ ఉంటే బెటర్ అనే ఈ నిర్ణయం తీసుకుందని శ్రియ సన్నిహితుల ద్వారా అందిన సమాచారం.
'ఇష్టం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత అగ్ర హీరోలందరితో నటించింది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు రాక ఐటం సాంగ్ లను కూడా చేయడానికి ఒప్పుకుంటుంది. సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో శ్రియ తన పరిస్థితి గురించి బాధపడుతూ తాగుడుకు బానిసై మందు మత్తులో మునిగి తేలుతుంది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ తనకు హాండిచ్చిందని ఫీలౌతోందట..ఇక ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేష్ సరసన ఓ సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











