పెళ్లి చేసుకొన్న అఖిల్ మాజీ ప్రేయసి.. వరుడు ఎవరంటే.. రాంచరణ్ హాజరు..

By Rajababu

Recommended Video

Shriya Bhupal Gets Married To Upasana's Cousin

అక్కినేని అఖిల్ మాజీ ప్రేయసి శ్రీయా భూపాల్ వివాహం ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు సంబంంధించిన అతిసన్నిహితులు హాజరయ్యారు. శ్రీయా పెళ్లాడిన అనిందిత్ రెడ్డి మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కు దగ్గరి బంధువు అనే విషయం తెలిసిందే. విదేశాల్లో జరిగిన పెళ్లికి రాంచరణ్‌తో కలిసి హాజరయ్యానని ఉపాసన వెల్లడించారు.

ఉపాసన కామినేని ట్వీట్

తన సోదరుడు అనిందిత్ రెడ్డికి పెళ్లికి హాజరైనట్టు ఉపాసన కామినేని ట్వీట్ చేశారు. కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరయ్యాను. రాంచరణ్‌తో కలిసి హాజరయ్యాను అని చెర్రీతో దిగిన ఫొటోను ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. అనిందిత్ రెడ్డి పెళ్లి ఇటీవల ప్యారిస్‌లో వైభవంగా జరిగింది.

మిస్టర్‌సీతో మధుర క్షణాలు

మిస్టర్ సీ (రాంచరణ్)తో గడిపిన మధురమైన క్షణాలను మరిచిపోలేను. అందుకు రాంచరణ్‌కు థ్యాంక్స్. అందమైన దుస్తులను డిజైన్ చేసిన సందీప్ కోస్లాకు అభినందనలు అని మరో ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నారు.

 అనిందిత్‌రెడ్డి గురించి

అనిందిత్‌రెడ్డి గురించి

అపోల్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవుడు అనిందిత్ రెడ్డితో శ్రీయా భూపాల్ నిశ్చితార్థం ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిశ్చితార్థ వేడుకకు రాంచరణ్, ఉపాసన హాజరైన సంగతి తెలిసిందే. ఉపాసనకు అనిందిత్ రెడ్డి తమ్ముడి వరుస అవుతుంది.

ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు

ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు

ఇక అనిందిత్ రెడ్డి గురించి చెప్పుకొంటే.. ఆయన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఆయన దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

అఖిల్‌లో పెళ్లి క్యాన్సిల్

అఖిల్‌లో పెళ్లి క్యాన్సిల్

గతంలో అక్కినేని అఖిల్‌తో శ్రీయా భూపాల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వారి వివాహం క్యాన్సిల్ అయింది. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తర్వాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ప్రస్తుతం అనిందిత్‌రెడ్డిని శ్రీయాభూపాల్ పెళ్లి చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X