ముద్దు, బికినీ సీన్లు చేస్తే తప్పేంటి? : శ్రియ

By Bojja Kumar

లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్లు అనగానే ప్రేక్షకులు వాటిని ప్రత్యేక కేటగిరీలో పెట్టి చూస్తారు. కొందరైతే వాటిని రోత సీన్లుగా భావిస్తారు. మరికొందరు ఇలాంటి వాటినే ఎక్కువగా ఇష్ట పడతారు. అయితే హీరోయిన్ శ్రీయ మాత్రం వీటిపై ఇలా స్పందించింది.

నా అభిప్రాయం ప్రకారం స్ర్కిప్టు డిమాండ్ చేసినప్పుడు లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్లు చేయడంలో తప్పేమీ కాదని భావిస్తాను. ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఆ సీన్లు కూడా భాగమే. సినిమా అన్నప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆనంద పరచాలి కదా అని అంటోంది బ్యూటీ.

ప్రస్తుతం శ్రియ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఒకప్పుడు సౌతిండియా టాప్ హీరోలందరి సరసన నటించిన శ్రియ ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడుతోంది. ఇటీవల కన్నడలో 'చంద్ర' అనే ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. సాండల్‌వుడ్‌లో పాగా వేయడానికి ఇదే మంచి తరుణం అని భావించిన శ్రియ సాధారణంగా తను తీసుకునే రూ. 70-80 లక్షల రెమ్యూనరేషన్ కంటే తక్కువ రేటుకే ఒప్పేసుకుంది.

ముద్దు సీన్లు, బికినీ సీన్ల గురించి శ్రియ ఇప్పుడు మాట్లాడటానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందట. అవకాశాలు లేక వెనకబడిన అమ్ముడు....ఇకపై ముద్దు సీన్లు, బికినీ సీన్లతో రెచ్చి పోవడానికి సిద్ధం అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X