హమ్మయ్య... శ్రియకు ఓ సినిమా వరించిందోచ్..!
ఒకప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా కనిపిస్తూ, మిగతా హీరోయిన్ల కన్నా ముందు వరసలో వున్న శ్రియ, ఈమధ్య టాలీవుడ్ నుంచి మెల్లగా కనుమరుగవుతోందనే చెప్పాలి. ఆమధ్య 'డాన్ శీను' సినిమాలో నటించినా, ఆమెకు తెలుగులో మళ్లీ ఆఫర్లు రాలేదు. గతంలో ఏ చిత్రంలో కనిపించినంత హాట్ హాట్ గా ఈ చిత్రంలో కనిపించి కురక్రారులో వేడిపుట్టించారు శ్రీయ. అయినా తను ఆశించినంతగా ఆ అందాల ప్రదర్శన సరైన ఫలితానివ్వలేదు. 'డాన్ శీను" తర్వాత ఈ భామను ఎటువంటి క్రేజీ ఆఫర్లు వరించలేదు. రజనీకాంత్ సరసన శివాజీ తర్వాతఅటు తమిళంలో కూడా సినిమాలు లేవు.
ఇక అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో తళుక్కున మెరిసిన ఈ గ్లామర్ తార ఈ నేపధ్యంలో తాజాగా ఓ తెలుగు సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది. దాంతో ఎగిరిగంతేసి, సైన్ చేసేసింది. సాయికృష్ణ ప్రొడక్షన్ లో మంచు మనోజ్ కథానాయకుడుగా నూతన దర్శకుడు 'అని' దర్శకత్వంలో డి.యస్.రావు నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాతోనైనా శ్రియకు మళ్లీ తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి.!


Click it and Unblock the Notifications