శాడిస్ట్ అండ్ సూపర్ హీరోతో శ్రియ రొమాన్స్...
శ్రియకి అన్ని ఇండస్ట్రీలు డోర్లు మూసేశాయి. అవకాశాల్లేక గోళ్లు గిల్లుకుంటున్న టైమ్ లో తెలుగు, తమిళాల్లో గెస్ట్ రోల్స్ దక్కాయి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్, సినిమాల్లో రెచ్చిపోయిన శ్రియ హీరోయిన్ ఛాన్స్ లకోసం ఎదురు చూస్తోంది. అనుకోకుండా ఆ అదృష్టం ఉపేంద్ర అందించాడు. ఉపేంద్, నయనతార నటించిన 'సూపర్" ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర తన తదుపరి చిత్రానికి సంబంధించిన సలహాలతో బిజీగా ఉన్నాడు. పి వాసు దర్శకత్వంలో ఉపేంద్ర ఓ చిత్రం చేయబోతున్నాడట. ఈ చిత్రంలో అతను దేశభక్తి ఉన్న పౌడిగా నటించనున్నాడని సమాచారం. ఇందులో ఉపేంద్ర సరసన శ్రియను కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇంకా దీని గురించి శ్రియతో సంప్రదింపులు జరపలేదని త్వరలో తనని కాంటాక్ట్ చేయబోతున్నారని సమాచారం. శ్రియ ఒకే అంటే కన్నడలో శ్రియకి ఇదే తొలిసినిమా. గతంలో కన్నడలో చిన్న ఐటంసాంగ్ చేసిన శ్రియ, ఇప్పుడు పుల్ లెంగ్త్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అక్కడైనా తన దశ తిరుగుతుందేమో అని ఎదురు చూస్తోంది శ్రియ.


Click it and Unblock the Notifications











