మాల్ గర్ల్ తో గొడవ పడిన కాసనోవా హీరోయిన్ శ్రియ
మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న కాసనోవా మలయాళ చిత్రంలో అందాల తార శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు లక్ష్మీరాయ్, మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. మోహన్ లాల్ నలుగురు హీరోయిన్లతో రోమాన్స్ చేస్తాడు. అయితే శుక్రవారంనాడు విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చిత్ర దృశ్యం సహజంగా రావడానికి దర్శకుడు ఓ ఎత్తు వేశారు. ఆ ఎత్తు ప్రకారం శ్రియ, మరో గర్ల్ మాల్ లోకి వెళ్లి హీరోపై చర్చ మొదలు పెట్టి వాదనలకు దిగారు. దీంతో వారి చుట్టూ జనం చేరి, వారిని విడదీయడానికి ప్రయత్నించారు. వారు నిజంగానో పోట్లాడుతున్నారని భావించి వారు అనుకుని విడదీయడానికి ప్రయత్నించారు. దర్శకుడు ఆ గుంపు వైపు పరిగెత్తి జనానికి అసలు విషయం చెప్పారు. ఇది షూటింగ్ కోసం జరిగిన వాదులాట అని సర్దిచెప్పాడు. ఈ సంఘటనకు శ్రియా, సినీ యూనిట్ నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











