twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎయిర్ పోర్ట్ లో శ్రియకు చేదు అనుభవం..?

    By Sindhu
    |

    ఒకప్పుడు నటి శ్రియ దక్షిణాది భాషల్లో టాప్‌లో ఉండేది. రానురాను కొత్త నీరు రావడంతో పాత నీరు వెనక్కువెళ్ళినట్లు ఈ ముద్దుగుమ్మకు సినిమాలు తగ్గిపోయాయి. అదేసమయంలో బాలీవుడ్‌లో కాలుపెట్టి.. అడపాదడపా నటిస్తోంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోలందరితోనూ నటించిన సెక్సీభామ శ్రియ. ఇప్పుడు కెరీర్‌లో చాలా కష్టాలు ఎదుర్కొంటోంది.

    ఇటీవల శ్రియకు ఓ చేదు అనుభం ఎదురయ్యింది. గోవా నుంచి ముంబాయ్ వెళ్లడానికి జెయిట్ ఎయిర్ వేస్ లో ఫ్లైయిట్ టిక్కెట్ బుక్ చేసుకుందట. కానీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన తర్వాత ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యిందట. మంచు పట్టెయ్యడంతో విమానం వెళ్లే వీలు లేనందున క్యాన్సిల్ చేసారట. కానీ ఆ విషయాన్ని ఎనౌన్స్ చేయలేదని శ్రియ మండిపడుతోంది. తనంతట తాను వెళ్లి అడిగితే కూల్ గా..వాతావరణం బాగా లేదు. ఫ్లైయిట్ క్యాన్సిల్ చేసాం అన్నారట. ఇంత నిర్లక్ష్యం తగదని, ఓ ప్లయిట్ క్యాన్సిల్స్ అయినప్పుడు ఆ విషయాన్ని ప్రయాణీకులకు ప్రకటించాల్సిన బాధ్యత ఎయిర్ పోర్ట్ వారిదేనని వాదిస్తోంది శ్రియ...

    ప్రస్తుతం దీవానా మస్తానా అనే హిందీ చిత్రాన్ని రీమేక్ చేస్తూ తెలుగులో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన్ శ్రియ సరన్ నటించనుంది. మరో హీరో శర్వానంద్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నారా రోహిత్ తో సోలో చిత్రం నిర్మిస్తున్న వంశి కృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి నారాయణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆఫర్లు లేని శ్రియ...నరేష్ పక్కన మంచి చాన్స్ కొట్టేసిందని కొందరంటే...అగ్ర హీరోల సరసన చేసిన తారతో సినిమే చేసే చాన్స్ మన కామెడి హీరో కొట్టేసాడని మరికొందరు అంటున్నారు.

    English summary
    Allari Naresh, the Comedy king of Tollywood is currently busy with 2 films Madatha Kaja with Sneha Ullal as female lead and the other is a bilingual film in the direction of Tamil director Samudrakani. The Latest news is, that the actor has signed up another new film under the direction of debutant Narayana. Shriya Saran has been considering for the female lead in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X