సీనియర్ల బాటలోనే ఆ హీరోయిన్ వేశ్యగా..!
హీరోయిన్ శ్రియ సినీ పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. రజనీకాంత్‌తో సహా దక్షిణాదిన అందరు అగ్రహీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా నటించింది. అయితే శ్రియకు ఇప్పటి వరకు నెం.1 స్థానం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ అవకాశాలు పెద్దగా లేవు. దీంతో ఐటం సాంగులు, అతిథి పాత్రలు సైతం వదలకుండా సినీ బండి లాగించేస్తుంది. మరో పైపు తరచూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి జనాలు తనను మరిచి పోకుండా జాగ్రత్త పడుతోంది.
ప్రస్తుతం శ్రియ బెంగాళీ సినిమాలో వేశ్య పాత్ర చేస్తుంది. ఈ పాత్ర విషయమై విలేకరులు ఆమెను ప్రశ్నించగా....పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం వేశ్య పాత్రలు చేసి తమ ప్రతిభను నిరూపించుకున్న వారే. అలాంటి పాత్రల్లో సంఘర్షణలు ఎక్కవుగా ఉంటాయి. వాటిని దర్శకుడు సమర్థవంతంగా తెరకెక్కిస్తే ఆ పాత్ర ఎవరూ పోషించినా వారి కెరీర్లోనే బెస్ట్ కేరక్టర్ అవుతుంది, ఎంతో అదృష్టం ఉంటేగానీ అలాంటి పాత్రలు రావని చెబుతోంది.
రీతూపర్ణ ఘోష్ రూపొందించబోయే తదుపరి చిత్రంలో వేశ్య పాత్రను చేయబోతోందామె. ఓ సెక్స్ వర్కర్ జీవితమే ఈ సినిమా. ఇందులో స్క్రిప్టు ప్రకారం బోలెడన్ని బోల్డ్ సీన్లలో నటించాల్సి ఉంది. ఒక సన్నివేశంలో అయితే నగ్నంగా నటించాల్సి ఉంటుందని ఘోష్ చెప్పాడట. అందువల్ల మొదట ఈ పాత్రను అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంది శ్రియ.


Click it and Unblock the Notifications











