తెలుగు పరిశ్రమలో తీపి జ్ఞాపకాలు: శ్రియ
తెలుగు పరిశ్రమలో నాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. హీరోయిన్ గా నాకు అడుగులు నేర్పింది తెలుగు పరిశ్రమే. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాకపోతే కళాకారులకు భాషతో సంబంధం ఉండదు కాబట్టి ఎక్కడ మంచి పాత్ర వస్తే అక్కడ చేస్తున్నాను. ఒకవేళ నేను తెలుగు సినిమాలు చేయకపోయినా ఇక్కడివారితో మాత్రం టచ్‌లోనే ఉన్నాను అంటోంది శ్రియ. ప్రస్తుతం రవితేజ సరసన చేస్తున్న డాన్ శ్రీను సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఆమెను కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు దూరం కావం లేదంటూ...అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాను కాబట్టి ఏమీ లోటు అనిపించలేదు అని సర్ధి చెప్పింది. ఇక శ్రియ ప్రస్తుతం పవన్ కళ్యాణ్...కొమురం పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











