నాగార్జున ఫ్యామిలీలోకి మోడ్రన్ వేశ్య!?
హైదరాబాద్: నాగార్జున ఫ్యామిలీలోకి మోడ్రన్ వేశ్య. వినడానికి వింతగా, ఆశ్యర్యంగా ఉన్నప్పటికీ ఇది తెలుగు సినిమా రీలు సాక్షిగా నిజం. అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి, పెడార్థాలు తీయడానికి మాత్రం ఏమీ లేదు. అసలు వివరాల్లోకి వెళితే... త్వరలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి 'మనం' అనే సినిమా తెరకెక్కబోతోంది.
ప్రస్తుతం 'పవిత్ర' అనే సినిమాలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటిస్తున్న హీరోయిన్ శ్రియ 'మనం' సినిమాలో హీరోయిన్ గా ఎంపికయినట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో శ్రియ నాగార్జునతో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. గతంలో శ్రియ నాగార్జునతో కలిసి సంతోషం, నేనున్నాను, బాస్ తదితర చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
'మనం' సినిమా వివరాల్లోకి వెళితే ఇష్క్ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సంవత్సరం ఈ చిత్రం ఫ్లోర్ మీదనకు వెళ్లనుంది. 'మనం' సినిమా తమ ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తోందని నాగార్జున ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో మూడు తరాల నటుల మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజజీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు. ప్రముఖ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ దీనికి ఫోటోగ్రఫీ అందిస్తుండగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











