twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున బాస్‌లో శ్రీయకు చిన్న పాత్ర

    By Staff
    |

    తన కెరీర్‌తో ప్రయోగాలు చేయడంలో శ్రీయకు మరెవరూ సాటిరారు. రజనీకాంత్‌ శివాజీకోసం బల్క్‌ డేట్స్‌ ఇవ్వడానికి త్రిష వంటి హీరోయిన్లు వెనుదిరగగా, శ్రీయ ఒక పథకం ప్రకారం కొన్నిటిని వదులుకుని ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడామె నాగార్జున తాజా చిత్రం బాస్‌లో ఒక చిన్న పాత్ర పోషిస్తోంది. అగ్రపథాన ఉన్న ఒక హీరోయిన్‌ తనకంటే జూనియర్‌ నయనతార ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ఒక చిన్న పాత్రకు ఒప్పుకోవడం విశేషమే. ఈ సినిమాలో నయనతార, ప్రధాన హీరోయిన్లు. రెండు పాటల చిత్రీకరణ కోసం బాస్‌ బృందం ఇటీవల మలేషియాలో మకాం వేసింది. విఎన్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రం నేనున్నానులో శ్రీయ ప్రధాన హీరోయిన్‌. ఆదిత్య-శివప్రసాద్‌ రెడ్డి- నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీయ పాత్ర చిన్నదైపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మలయాళంలో ఒక ప్రముఖ దర్శకుడు నయనతారకు ముందు చెప్పకుండా ఇలాంటి చిన్న పాత్రను ఖరారు చేయడంతో ఆమె అలిగి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం కట్టిన విషయం తెలిసిందే. బాస్‌ ఆడియో నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న విడుదల కానుంది. సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల అవుతుంది.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X