twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడగడానికి నోరెలా వచ్చింది?.. ఆ రెండు ప్రశ్నలపై శ్రీయ సీరియస్

    |

    వెండితెర హీరోలకు వయసుతో పనిలేదు. అర్థసెంచరీ క్రాస్ చేసినా.. ఇరవైల అమ్మాయితో ఆడి పాడగలరు. హీరోయిన్ల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ముప్పై దాటారంటే చాలు.. ఒక్కొక్క అవకాశం అలా దూరమైపోతుంటుంది. ఇక పెళ్లయిన హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పెళ్లి తర్వాత సహాయక పాత్రల్లోకి వారు షిఫ్ట్ అయిపోవాల్సిందే. ఇలాంటి పోకడలున్న ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా నిలకడగా అవకాశాలు అందిపుచ్చుకోవడమంటే మామూలు విషయమా?.. బహుశా అది శ్రీయకే సాధ్యమైందేమో!..

    నెలసరి సమయాల్లో కష్టం కదా!, శ్రీయకు చేదు అనుభవం.., ఆ రెండు సినిమాలు, నరకయాతన!నెలసరి సమయాల్లో కష్టం కదా!, శ్రీయకు చేదు అనుభవం.., ఆ రెండు సినిమాలు, నరకయాతన!

    <strong></strong>వైఫ్ మానేసింది.. అనసూయ అలా పిలుస్తోంది, శ్రీయను కౌగిలించుకోవాలనుకున్నా.. కానీ!: మోహన్ బాబు వైఫ్ మానేసింది.. అనసూయ అలా పిలుస్తోంది, శ్రీయను కౌగిలించుకోవాలనుకున్నా.. కానీ!: మోహన్ బాబు

     శ్రీయ ఫైర్:

    శ్రీయ ఫైర్:

    ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుండటంతో.. ఎక్కడికెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతోందట. మీడియా కంటపడితే చాలు ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తున్నారట. ఇటీవల మీడియా అడిగిన రెండు ప్రశ్నలు ఆమెకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయట. సున్నితంగా చెప్తే కుదరదని కాస్త ఘాటుగానే హెచ్చరించారట.

     ఆ రెండు ప్రశ్నలు..:

    ఆ రెండు ప్రశ్నలు..:

    'హాలీవుడ్ నటీమణులు 60 ఏళ్ల వరకు నటిస్తున్నారు, అలాంటిది నాకు ఆఫర్లు రావడంలో పెద్ద ఆశ్చర్యమేముంది. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీడియాకు నోరెలా వస్తుంది'. అని శ్రీయ ఫైర్ అయ్యారు. అలాగే మీరెలాంటి పెళ్లిని ఇష్టపడుతారు అన్న ప్రశ్నకు... 'అది మీకు సంబంధం లేని విషయం.. అంతవరకు చెప్పగలను' అని ఘాటుగా బదులిచ్చారు.

     ఆ బాధ తీరిపోయింది:

    ఆ బాధ తీరిపోయింది:

    గాయత్రి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె అలా బదులిచ్చారు. ఇక మోహన్ బాబు గారితో నటించలేకపోయానన్న బాధ ఈ సినిమాతో తీరిపోయిందని శ్రియ ఆనందం వ్యక్తం చేశారు. 'గాయత్రి'లో తన పాత్ర నిడివి తక్కువే అయినా.. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని వెల్లడించారు.

     కెరీర్ సీక్రెట్..:

    కెరీర్ సీక్రెట్..:

    ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో రాణించడానికి గల కారణమేంటో శ్రీయ ఈ సందర్భంగా వెల్లడించారు. దర్శకులు, రచయితలు తన కోసం కొత్త పాత్రలను సృష్టిస్తున్నారని, అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుండటం వల్లే తనను ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల ఎంపికలో తన అభిరుచి కూడా ఇందుకు తోడ్పడిందని చెప్పింది.

     గాయత్రిలో పాత్ర ఇలా..:

    గాయత్రిలో పాత్ర ఇలా..:

    ఈ సినిమాలో నా పాత్ర పల్లెటూరి అమాయకత్వంతో కూడుకుని ఉంటుంది. సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మదన్ నా పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దారు. అతను కథ చెప్పినప్పుడే చాలా కనెక్ట్ అయ్యాను. మదన్ డైరెక్షన్ చాలా కూల్‌గా ఉంటుంది. సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.

     శ్రీయ ప్రస్తుత సినిమాలు..:

    శ్రీయ ప్రస్తుత సినిమాలు..:

    శ్రీయ 'గాయత్రి' సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రస్తుతం వీరభోగ వసంతరాయలు అనే సినిమాతో పాటు తమిళంలో కార్తీక్ నరేన్ తో 'నరగసూరన్' చేస్తున్నట్లు శ్రీయ తెలిపారు. 'గాయత్రి'లో శ్రీయ పాత్రకు మంచి మార్కులు పడితే.. ఆమెకు మరిన్ని అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.

    English summary
    Shriya Saran is in Hyderabad to promote ‘Gayatri’. During an interaction with the media earlier on Monday, she was angry at two specific questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X