ఎప్పుడూ అదే అంటే బోర్: శ్రియా
ఎప్పుడూ అన్నీ విప్పి చూపాలంటే బోరే కదా అంటోది శ్రియ. తను నటన కాకుండా ఎంతసేపూ గ్లామర్ ప్రదర్శన చేయాలంటే విసుగేకదా అంటోంది. తాజాగా ఆమె నేను గ్లామర్ కి దూరం అని చెప్పటం ప్రారంభించింది. ఏదో కాస్త నిన్ను చూపి నాలుగు డబ్బులు చేసుకుందామనుకుంటేంటే ఈ ట్విస్ట్ ఏంటమ్మా అని నిర్మాతలు గొణుక్కుంటున్నారు.
రజనీకాంత్ 'శివాజీ'లో అదరకొట్టిన శ్రియ ఇటీవల విడుదలైన 'పిస్తా'లో కూడా ఎక్స్ పోజింగ్ పరంగా నియమాలేమీ పెట్టుకోకుండా విప్పతీసింది. ఇక 'మల్లన్న' ఫొటోలు చూస్తే ఎంతగా రెచ్చిపోయిందో అనిపించకమానదు. అలాంటి శ్రియ...ఇకనుంచి గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటాను అంటే, చాలామంది నిర్మాతలకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లు అయింది. అందులోనూ ఆమె హీరోయిన్ గా నటించిన మూడు తమిళ చిత్రాల షూటింగ్స్ పూర్తయ్యాయి.
వీటిలో శ్రియ గ్లామర్ పాత్రలనే చేశారు. వరుసగా మూడు సినిమాల్లోనూ ఎక్స్ పోజింగ్ క్యారెక్టర్స్ చేయడం ఆమెకే బోర్ కొట్టేసిందని చెప్తోంది. అందుకని, గ్లామర్ పాత్రలకి చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారని వినికిడి. ఈ కారణంగా మూడు పెద్ద సినిమాలను సైతం తిరస్కరించింది. నటనకు కొంచెం అవకాశం ఉన్న పాత్ర ఏదైనా సరే ఒప్పుకోవాలనుకుంటునాని చెప్తోంది. ఏదైమైనా హఠాత్తుగా ఆమె ఇలా మనసు మార్చుకోవడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











