కావాలని ఎవరో చేస్తున్న కుట్ర కోర్టుకు వెళతా: శ్రియ
నా ఇమేజ్‌ని డామేజ్ చేయడానికి కావాలని ఎవరో చేస్తున్న కుట్ర ఇదంతా. ఆ ఫొటోలు నావి కావు. అవి మార్ఫింగ్ ఫొటోలు. ఈ విషయంపై అవసరమైతే కోర్టుకు కూడా వెళతా అంటూ ఆవేశంతో ఊగిపోతోంది శ్రియ. రీసెంట్గా శ్రియ ఓ పబ్బులో ఎక్కువ తాగి శ్రియ ఇష్టమొచ్చిన ట్లు ఎగిరిందని, ఆ మత్తులోనే ఇద్దరిపై ఆమె చేయి కూడా చేసుకున్నారనీ తమిళ మీడియాలో ఇటీవల వరసగా కథనాలు వెలువడ్డాయి.అంతేగాక పబ్బులో శ్రియ చేసిన వీరంగానికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చింది. వాటి గురించి తెలుసుకున్న శ్రియ.. అందులో ఏ మాత్రం నిజం లేదని, అస్సలు తాను పబ్బులకు వెళ్లడమే తక్కువ అని వివరణ ఇలా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











