నాగార్జున సినిమాలో శ్రీయ ఐటం సాంగ్
రజనీకాంత్ శివాజీ సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీయ మరో ఆరేడు నెలల వరకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె అభిమానులు పెదవి విరిచారు. కానీ వారిని నిరుత్సాహ పరచకుండా శ్రీయ నాగార్జున తదుపరి చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో శివాజీతో పాటు, రజనీ అల్లుడు ధనుష్ సినిమాలో కూడా శ్రీయ నటిస్తోంది. శివాజీ సినిమాకు మొదట త్రిష పేరును పరిశీలించినా ఆమె బల్క్ డేట్స్ ఇవ్వడానికి తటపటాయించడంతో శ్రీయకు ఛాన్స్ దక్కింది. ఈ మధ్య కాలంలో శ్రీయ నటించిన తెలుగు సినిమాలు విడుదల కాలేదు.


Click it and Unblock the Notifications