హీరోయిన్ శ్రియ కళ్లు చెదిరే ‘కలరి’ ఫైటింగ్
ఈ చిత్రంలో శ్రియ కలరి ఫైట్స్ చేస్తోందట. ఈ విశేషాలను గురించి శ్రియ తెలియజేస్తూ ... 'చంద్ర' సినిమాకోసం నిన్ననే ఒక అందమైన దేవాలయంలో చిత్రీకరించిన కలరి ఫైట్ సన్నివేషాల చిత్రీకరణలో పాల్గొన్నాను. ఈ ఫైట్ లో వాడిన కత్తులు మరియు కాస్ట్యూమ్స్ చాలా బరువుగా ఉండడం వల్ల ఇప్పటికీ కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నాకు మరియు ప్రేమ్(కో స్టార్)కి మధ్య జరిగే ఈ యాక్షన్ సన్నివేశాలను రూప అయ్యర్ (దర్శకురాలు) ఎంతో బాగా చిత్రీకరించారని' తన ట్విట్టర్లో పేర్కొంది.
ఈ సినిమాలో తాను పోషిస్తున్నది రాజకుమారి పాత్రే అయినా, అది నేటి కాలంలో జరిగే కథగానే ఉంటుందనీ, చారిత్రికంగా ఉండదనీ ఆమె అంటోంది. ఇంకో విషయం ఏమిటంటే, ఇందులో తాను మొదటి నుంచి చివరి వరకూ... చీరకట్టులోనే కనిపిస్తుందట. ఎప్పుడూ కురచ దుస్తుల్లో కనిపించే శ్రియా, తొలిసారిగా ఇలా చీరలో కనిపించడం మనకు కొత్తే అయినప్పటికీ... ఆమె బ్రాండ్ సెక్సీతనాన్ని మాత్రం ఇందులో కూడా మనం చూడచ్చట!
ఈ చిత్రంతో పాటు శ్రియ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మరియు దీప మెహత దర్శకత్వం వహించిన 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' చిత్రాలతో శ్రియ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












