శ్రియ ‘మహాముదురు’
ఏ ఆర్టిస్ట్ కైనా చేతినిండా సినిమాలుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం శ్రియ పరిస్థితి అలానే ఉంది. రిలాక్స్ అవ్వడానికి కూడా తీరిక చిక్కడంలేదట. అందుకేనేమో ఆ మద్య తనంతట తానుగా బ్రేక్ తీసుకొని విహార యాత్రకు వెళ్లారామె. కొంత విరామం తర్వాత ప్రెష్అప్ అయి మళ్ళీ బిజీ కాబోతున్నది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'అళగియ తమిళ్ మగన్" తెలుగులో లక్ష్మీ వెంకటేశ్వర ప్రొడక్షన్ పతాకంపై అడ్డాల వెంకట్రావు, జమీలా 'మహాముదురు" పేరుతో అనువదిస్తున్నారు. శ్రియ, నమిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని గాయకుడు మనో సమర్పిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వైవిధ్యమైన కథాంశంతో, ఆసక్తికరమైన సన్నివేశాలతో, కనువిందైన గ్లామర్ తో, మాస్ ప్రేక్షకుల్ని అలరించే యాక్షన్ తో ఈ సినిమాని దర్శకుడు రూపొందించారు. తమిళంలో ఎ.ఆర్ రెహమన్ స్వరపరిచిన సంగీతం సినిమా మొత్తానికే హైలెట్. ఆరు పాటలూ సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో ఈ పాటల్ని చంద్రబోస్, సాహితి రాస్తున్నారు. దీపావళి రోజు ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications











