ఇలియానా కిక్ శ్రియకి టానిక్!
'శివాజీ" చిత్రంలో రజనీకాంత్ సరసననటించిన శ్రియకు ఒక్కసారిగా అనుకోనంత ఎత్తులోనికి వెళ్ళిపోయిన శ్రియ ఆపై కోలీవుడ్ లో ఫుట్ బిజీ అయిపోవడమే కాక బాలీవుడ్, హాలీవుడ్ లలో కూడా ఓ రౌండ్ వేసేసింది. అయితే ఆమె ఆశలన్నీ అడియాసలై ప్రతిచోటా పరాజయాలే పలకరించడంతో తిరిగి తిరిగి చివరికి టాలీవుడ్ కే తిరిగొచ్చేసింది. రవితేజ హీరోగా చేస్తోన్న తాజా చిత్రం 'డాన్ శీను" లో హీరోయిన్ గా తొలుత త్రిషని అనుకున్నప్పటికీ అక్షయ్ కుమార్ హిందీ చిత్రంతో త్రిష బిజీగా వుండడం వల్ల ఆ ఛాన్స్ శ్రియకి దక్కింది.
ఇంకేముంది ఈ చిత్రంతో టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ్యాలనుకున్న శ్రియకి ఇప్పుడు ఇలియానా కిక్ టానిక్ గా మారింది. అదెలా అంటారా..రవితేజతో ఇలియానా చేసిన ఫస్ట్ మూవీ 'ఖతర్నాక్" డిజాస్టర్ అయితే సెకండ్ మూవీ 'కిక్" సూపర్ హిట్ అయింది. శ్రియది కూడా సేమ్ ప్లాష్ బ్యాక్. గతంలో రవితేజ కాంబినేషన్ లో చేసిన 'భగీరథ" భారీ ప్లాప్ కనుక ఈసారి గ్యారంటీగా సూపర్ హిట్ అనుకుంటోందట!


Click it and Unblock the Notifications











