మహేష్ తో ఎక్స్ పీరియన్స్ మరచిపోలేను..!?
దక్షిణాదిన అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ తో ముంబైలో సెటిలైపోయి తెలుగు ప్రేక్షకులతో పాటు ఇక్కడి ఆఫర్లను దూరం చేసుకున్న శ్రియ అక్కడ ఆదరణ లభించక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 'డాన్ శీను" సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ముందు దర్శక నిర్మాతలను ఆకట్టుకున్న శ్రియను, డాన్ శీను విడుదలయ్యాక ఎవరూ పట్టించుకోవడం లేదట. అయినప్పటికీ శ్రియ తన చేతినిండా అవకాశాలు ఉన్నాయని, మంచి ప్రాజెక్ట్ ను ఎంచుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నానని చెబుతోంది.
అంతేకాక తెలుగులో అగ్ర హీరోలందరితో నటించిన అదృష్టం తనకే దక్కిందని గొప్పలు చెబుతోందట. పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" చిత్రంలో ఐటం సాంగ్ తో రీఎంట్రీ ఇచ్చిన శ్రియ పవన్ చాలా కూల్ గయ్ అని అంటోంది. మహేష్ తో అర్జున్ సినిమాలో నటించిన శ్రియ ఆ చిత్రం అంతగా హిట్ అవ్వనప్పటికీ, అప్పట్లో మహేష్ నుండి చాలా నేర్చుకున్నానని, మహేష్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరచిపోలేనని, చాన్స్ వస్తే మహేష్ తో ఇంకోసారి నటించాలని ఉందని చెబుతోంది.


Click it and Unblock the Notifications











