పవన్ కళ్యాణ్ పేరు విన్నాక ఆగలేక...శ్రియ
పవన్ కల్యాణ్, ఏఆర్ రెహమాన్...వీరిద్దరి పేర్లు విన్నాక ఇక చేయను అని అనగలనా? అంటోంది శ్రియ. కొమురం పులి చిత్రంలో చేసిన ఐటం సాంగ్ గురించి మీడియా వారు ప్రశ్నిస్తే ఆమె ఇలా సమాధానమిచ్చింది. డాన్ శీను చిత్రంలో రవితేజ సరసన చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ చిత్ర ప్రమోషన్ లో బాగంగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్బంగా రవితేజ గురించి చెబుతూ...అంతకు ముందు రవితో 'భగీరథ' చేశాను. 'డాన్ శీను' తర్వాత ఆయన అభిమానిగా మారిపోయాను. సెట్ లో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు. ఏదోలా ఆట పట్టిస్తారు అంది. ఇక అలీ, బ్రహ్మానందం...ఇలాంటి వారితో పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. అలీని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచీ నటిస్తున్నా, ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా చేయడం వల్ల అంజనా సుఖానీ అనే స్నేహితురాలు దొరికింది అంది.
శ్రియ పవన్ కళ్యాణ్ పులి రవితేజ డాడాన్ శీను అంజనా సుఖానీ shriya puli pawan kalyan ravi teja don seenu


Click it and Unblock the Notifications