twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీయ ‘పవిత్ర’ రిలీజ్ డేట్ ఖరారైంది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : శ్రీయ టైటిల్ రోల్‌లో జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పవిత్ర'. ఉప శీర్షిక 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్'. కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదకు సిద్ధం అవుతోంది. మే 10వ తేదీన ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    సినిమా గురించి నిర్మాతలు మీడియాకు వెల్లడిస్తూ 'జనార్ధన మహర్షి అద్భుతమైన కథ ఇచ్చారు. కథనం కూడా బాగా కుదిరింది. టైటిల్ రోల్‌ని శ్రీయ అద్భుతంగా చేసింది. స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేసాం. అందుకే ఇది బోల్డ్ సినిమా అయినా గోల్డ్ లా ఉంటుందని దర్శకుడు అంటున్నారు' అని చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ...'శ్రీయ కొత్త కోణంలో కనిపించే చిత్రం ఇది. అలాగే కౌశిక్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. నటి రోజా ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో చేస్తున్నారు. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓ దేశంలో గవర్నర్ వెళ్లిన సభకు వేశ్య కూడా వస్తే ఆయన ఆమెను అక్కడి నుంచి వెళ్లి పొమ్మని ఆమెను ఆదేశించారట. ఆమె అదే స్థానంలో అతనిపై పోటీ చేసి గెలిచిందట. ఎప్పుడో చదివిన ఈ అంశం స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కించాను. 90 సినిమాల రచయితగా నాకు పూరిపూర్ణమైన సంతృప్తిని ఇచ్చిన సినిమా' అని వెల్లడించారు.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఏవీఎస్, సాయి కుమార్, శివాజీ, రవిబాబు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానకి సంగీతం : ఎంఎం.శ్రీలేఖ, కెమెరా : విఎన్. సురేష్, ఎడిటింగ్ : రమేష్, ఆర్ట్ : నాగేంద్రబాబు, నిర్మాతలు : కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం : జనార్ధన మహర్షి.

    English summary
    Pavitra movie shooting completed. The film is going to hit the screens on May 10. Shriya play title role. Janardhan Maharshi, who penned dialogues for Rajamouli's 'Eega', debuted into direction with SPB and K Vishwanath-starrer 'Devasthanam'. He is directing this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X