లైంగిక వేధింపుల 'శ్రియ'...

'వాట్ ఈజ్ కుకింగ్' పేరుతో తయారయ్యే ఈ సినిమాలో శ్రియ ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించనుంది. లైంగికంగా వేధింపులకు గురిఅయ్యే గృహిణిగా ఆమె ఈ సినిమాలో తన ప్రతిభను మరో సారి ప్రదర్శించనుంది.కథ ప్రకారం భారతీయ గృహిణిగా తన భాద్యతలను నిర్వర్తించే క్రమంలో ఆమె ఈ తరహా వేధింపులకు గురివుతుందని అదే సినిమాకు యుఎస్ పి అని తెలుస్తోంది.
గతంలో ఐశ్వర్యారాయ్ 'ప్రొవొకెడ్' సినిమాలో ఇటువంటి పాత్ర పోషించి పేరు తెచ్చుకోవటంతో శ్రియ దీనికి ఆనందంగా ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే దీపామొహతా తన ఆస్కార్ నామినేటెడ్ 'వాటర్' సినిమాలో ప్రధానపాత్ర (లిసారే) కాశీలో నివసించే సనాతన వితంతువుగా ఉంటూ బ్రతుకు తెరువు కోసం వేశ్యా వృత్తిని చేస్తూంటుంది.అది ఎన్నో వివాదాలను తెచ్చిపెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ సినిమాకూడా తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందని శ్రియ భావిస్తోంది.
ఈ సినిమాలో దీపా మహాభారతాన్ని టీవి సీరియల్ గా అందించిన బి.ఆర్.ఫిలిమ్స్ వారితో టై అప్ అయి చేస్తోంది.సినిమా మొత్తం న్యూడిల్లీలో షూటింగ్ జరుపుకోనుంది.త్వరలో ప్రారంభమయ్యే ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని దీపా భావిస్తున్నారు.ఈ సినిమాలో బ్యాండిట్ క్వీన్ ఫేమ్ సీమా బిశ్వాస్ కూడా మరో పాత్రలో చేయనుంది.ప్రస్తుతం శ్రియ పూర్తి చేసిన విక్రమ్ మల్లన్న రెడీకి సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











