రవితేజ డాన్ శీనులో త్రిష కాదు శ్రియ
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేనిని దర్శకుడుగా పరిచయం చేస్తూ డాన్ శీను అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనూష్కను అనుకున్నారు. ఆ తర్వాత త్రిష వచ్చి చేరింది. అంతా కృష్ణ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నారు. అయితే ఇప్పుడు త్రిషకు డేట్స్ ఎడ్జెస్ట్ కాలేదని చేతులు ఎత్తేయటంతో ఆ ప్లేస్ లోకి శ్రియ వచ్చి చేరింది. శ్రియకు తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. అడపా దడపా శివాజి, మల్లన్న అంటూ డబ్బింగ్ చిత్రాలలో పలకరించటమేకాని డైరక్ట్ గా ఆమెకు అవకాశాలు రావటం లేదు. అటువంటి సమయంలో ఆమెకు తెలుగు రీఎంట్రీ అన్నట్లు డాన్ శీనులో ఆఫర్ దక్కింది. అంతకుముందు కూడా రవితేజ భగీరధ అనంతరమే ఆమె బాలీవుడ్ వలస పోయింది. ఇప్పుడు మళ్ళీ రవితేజతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి తోడు ఆమె పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో ఐటం సాంగ్ కూడా చేస్తోంది. చూస్తూంటే మళ్ళీ తెలుగులో ఆమె హవా నడిచే వాతావరణం కనపడుతోందంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











