కోటి రూపాయల ఆఫర్ వదులుకొన్న శ్రియకు హ్యాట్సాఫ్...!?
మామూలుగా వెండితెర మీద హీరోయిన్ల జీవితకాలం తక్కువ. ఐదారేళ్లకు ఫేడ్ ఔట్ అయిపోతుంటారు. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో తమ గ్లామర్ని ఉపయోగించుకుని అన్ని మార్గాలలోనూ సంపాదన చేసేస్తారు. ఈ కోవలో ఈమధ్య కాలంలో హీరోయిన్లకు కమర్షియల్స్ బాగా డబ్బు తెచ్చిపెడుతున్నాయి. ఒక యాడ్ చేస్తే కోట్లలో డబ్బు వచ్చిపడుతోంది. అయితే, అందాల శ్రియా ఈమధ్య మూడు కోట్లిస్తామన్నా ఓ 'మందు' కంపెనీ యాడ్ లో నటించడానికి తిరస్కరించిందట.
'మానవ దేహం పవిత్రమైన దేవాలయం లాంటింది. మద్యపానం, సిగట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌లాంటివి తీసుకుంటూ దాన్ని అపవిత్రం చేయొద్దు" ఇవి శ్రీయ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఈ అమ్మాయిలో గొప్పతనం ఏంటంటే సినిమాలు లేకపోయినా డబ్బు కోసం ఏ పనిచేస్తే ఆ పనికి ఒప్పుకోదట. తన స్థాయికి తగ్గ అవకాశాలు వస్తేనే సినిమాలు చేస్తుందట. అంతేకాదు, ఓ వైన్ కంపెనీ భారీ పారితోషికం ఆశ చూపినా తనకు ఆ యాడ్ చేయడం ఇష్టం లేదంటోంది.
ఆఫరు వేల్యూ ఎంతో తెలుసా ఏకంగా కోటి రూపాయలు !. అయితే ప్రజల ఆరోగ్యానికి హాని చేసే అలాంటి ప్రకటనల్లో తానెప్పుడూ నటించనని, తారలు నటిస్తే ప్రజలను తప్పుదారి పట్టించినట్టే అని అన్నారు. ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయినా, ఇంటి ముంగిటకు వచ్చిన ఈ అవకాశాన్ని వదిలేసిన శ్రియాను ఇప్పుడంతా అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











