స్పెయిన్ పోలీసులు పట్టుకొన్నారు.. అండ్రూ నా భర్త అంటే నమ్మలేదు.. శ్రీయ బార్సిలోనా కష్టాలు
తమ వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకొనేందుకు స్పెయిన్ వెళ్లిన అండ్రూ, అందాల భామ శ్రీయకు బార్సిలోనాలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వెళ్లిన మరుసటి రోజే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం అక్కడ పరిస్థితి చాలా దారుణంగా దిగజారడంతో శ్రీయ దంపతులకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే వారిద్దరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొంటూనే కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను శ్రీయ వెల్లడిస్తూ

స్పెయిన్‌లో దారుణంగా బుక్ అయ్యాం
మా మ్యారేజ్ యానివర్సరీ నేపథ్యంలో మేము స్పెయిన్‌కు వెళ్లాం. అక్కడికి వెళ్లిన రెండు మూడు రోజులకే పరిస్థితి దారుణంగా మారింది. ఒక్కసారిగా కరోనావైరస్ విజృంభించడంతో మాకు కష్టాలు ఆరంభమయ్యాయి. దాంతో బయట తిరగడం మానేసి కరోనా గురించి ఇంటర్నెట్‌లో చదవడం ప్రారంభించాం. కరోనా లక్షణాలను తెలుసుకోవడం మొదలుపెట్టాం. అలా వీలైనంతగా కరోనా బారిన పడకుండా శ్రద్ద తీసుకోవడం మొదలు పెడుతున్న సమయంలో మాకు ఓ షాక్ తగిలింది.

హాస్పిటల్‌కు వెళ్లితే బయటకు పంపించారు
ఊహించని విధంగా అండ్రూ జ్వరం బారిన పడ్డారు. పొడిదగ్గు ముందలైంది. వెంటనే మేము హాస్పిటల్‌కు వెళ్లాం. అయితే డాక్టర్లు పట్టించుకోకుండా హాస్పిటల్ నుంచి వెళ్లిపోమ్మని కోరారు. అయితే కరోనావైరస్ కాదని చెప్పడం సంతోషం కలిగింది. ఇంటి వద్దనే ఉంటూ క్షేమమని డాక్టర్లు సెలవు ఇచ్చారు. అయితే కొవిడ్19 రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాం అని శ్రీయ చెప్పారు.

అండ్రూకు జ్వరం, దగ్గు
అండ్రూకు జ్వరం తగ్గడానికి మెడిసిన్స్ తీసుకొని ఇంటికే పరిమితమయ్యాం. ఆ తర్వాత కొద్ది రోజులకు అండ్రూ కోలుకోవడంతో నాకు ఉపశమనం కలిగింది. చాలా రోజులు వేర్వేరు రూంలోనే మేము గడిపాం. సోషల్ డిస్టెన్స్, సెల్ఫ్ డిస్టెన్స్‌ను పాటించాం. ఇప్పుడు ఇద్దరికి బాగా ఉంది. మాకు ఎలాంటి సమస్యలు లేవు అని శ్రీయ తమ కష్టాలను వివరించారు.

రెస్టారెంట్‌కు వెళితే బయటకు వెళ్లమని
మా వివాహ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మేము ముందే ఓ రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకొన్నాం. ఆ రెస్టారెంట్‌కు వెళితే అంతా మూసేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రెస్టారెంట్ లోనికి రానివ్వలేదు. దాంతో స్ట్రీట్స్‌లో ఉండగానే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకొన్నారు. లాక్‌డౌన్ పిరియడ్‌లో రోడ్లపై ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు అనే విషయాన్ని శ్రీయ వెల్లడించారు.
Recommended Video

పోలీసులు అనుమానంగా
పోలీసులు మమ్మల్ని అనుమానంగా చూడటంతో మా గురించి చెప్పి వాళ్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాం. కానీ వారు నమ్మలేదు. అండ్రూ నా భర్త అని, మేమిద్దరి మ్యారేజ్ యానివర్సిరీ సెలబ్రేషన్ కోసం స్పెయిన్‌కు వచ్చాం. అనుకోకుండా ఇలా ఇరుక్కుపోయామని చెప్పా. అయితే మేమిద్దరం భార్యభర్తలంటే నమ్మలేదు. అండ్రూ విదేశీయుడిగా కనిపించడం, నేను ఇండియన్‌గా ఉండటంతో రకరకాలుగా ప్రశ్నించారు. వారు ఓ దశలో అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. చివరకు మమల్ని వదిలిపెట్టి వెళ్లారు అని శ్రీయ చెప్పారు.


Click it and Unblock the Notifications











