Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు గెలిస్తే అదే నా ఫేవరెట్ టీమ్, అఖిల్ ఆట అదిరింది!
ఈ నెల 4న సినిమా తారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ఆరంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ రంగాలకు చెందిన నటులు ఈ సీసీఎల్ మ్యాచ్‌లో జోరుగా పాల్గొంటున్నారు. ఈరోజు (శనివారం) వైజాగ్‌లో జరిగే పోరులో ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు తలపడనుందో తెలిసిపోతుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సీసీఎల్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న శ్రియ శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -''భారతీయులు ఇష్టడేది క్రికెట్, సినిమాలు. తమ అభిమాన తారలు ఆడే అభిమాన క్రీడను తిలకిస్తూ ప్రేక్షకులు పులకించిపోతున్నారు. సీసీఎల్ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆనందంగా ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తున్నాను కాబట్టి అందరూ నా స్నేహితులే. అందుకే ఏ ఒక్క జట్టుకో కాకుండా మొత్తం సీసీఎల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని చెప్పాను. ఆట మైదానంలో ఆటగాళ్లను ఉత్తేజపరచడం ఓ కొత్త అనుభూతి.
నేను ప్రత్యేకంగా ఏ ఒక్క టీమ్‌కో సపోర్ట్ చేయడంలేదు. ఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు గెలిస్తే అదే నా ఫేవరెట్ టీమ్"" అన్నారు. సినిమా నటుల్లో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు -''అందరూ బాగా ఆడుతున్నారు. కాకపోతే అందరికన్నా అఖిల్ బాగా ఆడుతున్నాడు"" అన్నారు శ్రియ. మహిళా తారలతో సీసీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే తప్పకుండా ఆడతానని కూడా పేర్కొన్నారు శ్రియ. ఈ సమావేశంలో మరో హీరోయిన్ తషు కౌశిక్, 'సీసీఎల్" ప్రతినిధి మూర్తి కూడా పాల్గొన్నారు.