twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు గెలిస్తే అదే నా ఫేవరెట్ టీమ్, అఖిల్‌ ఆట అదిరింది!

    By Nageswara Rao
    |

    ఈ నెల 4న సినిమా తారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ఆరంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ రంగాలకు చెందిన నటులు ఈ సీసీఎల్ మ్యాచ్‌లో జోరుగా పాల్గొంటున్నారు. ఈరోజు (శనివారం) వైజాగ్‌లో జరిగే పోరులో ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు తలపడనుందో తెలిసిపోతుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సీసీఎల్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న శ్రియ శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -''భారతీయులు ఇష్టడేది క్రికెట్, సినిమాలు. తమ అభిమాన తారలు ఆడే అభిమాన క్రీడను తిలకిస్తూ ప్రేక్షకులు పులకించిపోతున్నారు. సీసీఎల్ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆనందంగా ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తున్నాను కాబట్టి అందరూ నా స్నేహితులే. అందుకే ఏ ఒక్క జట్టుకో కాకుండా మొత్తం సీసీఎల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని చెప్పాను. ఆట మైదానంలో ఆటగాళ్లను ఉత్తేజపరచడం ఓ కొత్త అనుభూతి.

    నేను ప్రత్యేకంగా ఏ ఒక్క టీమ్‌కో సపోర్ట్ చేయడంలేదు. ఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు గెలిస్తే అదే నా ఫేవరెట్ టీమ్"" అన్నారు. సినిమా నటుల్లో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు -''అందరూ బాగా ఆడుతున్నారు. కాకపోతే అందరికన్నా అఖిల్ బాగా ఆడుతున్నాడు"" అన్నారు శ్రియ. మహిళా తారలతో సీసీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే తప్పకుండా ఆడతానని కూడా పేర్కొన్నారు శ్రియ. ఈ సమావేశంలో మరో హీరోయిన్ తషు కౌశిక్, 'సీసీఎల్" ప్రతినిధి మూర్తి కూడా పాల్గొన్నారు.

    English summary
    CCL final match is going on 12th of june at hyderabad.on this occasion CCL brand am finals ambassador Shriya participated in a press meet in daspalla hotel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X