లేటుగా స్పందించినా లేటెస్ట్‌గా.. అమితాబ్‌ ఆరోగ్యంపై ఆందోళన.. శ్రియా ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ దైవం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి యావత్ భారతదేశం ఆందోళన చెందింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అంతటి బిగ్ బీపై తాజాగా శ్రియా సరన్ స్పందించింది. బచ్చన్ ఆరోగ్యంపై శ్రియా ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో తెగ ఆకట్టుకుంటోంది.

 బచ్చన్ ఫ్యామిలీకి కరోనా..

బచ్చన్ ఫ్యామిలీకి కరోనా..

ఇండియా మొత్తం కరోనా విజృంభిస్తుండగా మహారాష్ట్ర, ముంబైలో తాండవం చేస్తోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలకు కరోనా సోకడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. అందులోనూ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 కుటుంబమంతా హాస్పిటల్‌లోనే..

కుటుంబమంతా హాస్పిటల్‌లోనే..

బచ్చన్ ఫ్యామిలీలో మొదటగా అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఆ వెంటనే వారిద్దరూ నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అయితే ఐశ్వర్యా, ఆరాధ్యలకు మొదటగా నెగెటివ్ వచ్చింది.. ఆపై పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నా.. సమస్య తీవ్రతరం కావడంతో నానావతి ఆస్పత్రిలోనే జాయిన్ చేశారు.

 శ్రియా ఎమోషనల్..

శ్రియా ఎమోషనల్..

అయితే తాజాగా శ్రియా సరన్ అమితాబ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందింది. లేటుగా స్పందించినా.. ఎమోషనల్ అయింది. ‘త్వరగా కోలుకోండి అమితాబ్ సర్.. మిమ్మల్ని ఎన్నో యేళ్ల క్రితం కలిశాము.. ఖుదా గావాహ్ సినిమా షూటింగ్‌లో మీరు బిజీగా ఉన్నారు. అప్పుడు నేను చిన్న పిల్లను.. మీరు ఓ స్టార్.. అఫ్‌కోర్స్ మీరు ఎప్పటికీ ఓ స్టార్.

Recommended Video

RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
ఎంతో ఆరాధించాము..

ఎంతో ఆరాధించాము..

మీ వినయంతో మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్ అయిపోయారు. మీరో గొప్ప నటులు. మీ పని పట్ల మేము ఎంతో సంతోషించాము.. ప్రేమించాము.. అభినందించాము.. ఆరాధించాము.. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలి సర్.. మళ్లీ ఏదో ఒక రోజు మనం కలుసుకుంటాము.. అది ఎంతో కూల్ కూల్ కూల్‌గా ఉంటుంద'ని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X