హాట్ గా శ్రియను చూడాలంటే?

ఇక ఈ సినిమాలో అందులో శ్రిది ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ మేనేజర్ పాత్ర. తమ ఆ కంపెనీ కస్టమర్, అమెరికన్ అయిన జెస్సీ మెట్‌కాఫ్ ('ద డెస్పరేట్ హౌస్‌వైవ్స్' ఫేమ్)తో ఆమె పీకలోతు ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పకుండా అమెరికాకు వెళ్లిన ఆమె అక్కడ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నదనేది ఈ చిత్ర కథాంశం.
జేమ్స్ డాడ్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ అమృతరాజ్ నిర్మిస్తున్నాడు. టైటిల్ 'ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్స్'కు తగ్గట్లే ఇందులో జెస్సీ, శ్రియ హాట్ హాట్ సీన్లలో కనిపించబోతున్నారనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న హాట్ న్యూస్. శ్రియ తండ్రిగా అనుపమ్ ఖేర్ నటించే ఈ సినిమాలో 'పేజ్ 3' గర్ల్ తారాశర్మ కూడా కనిపించనున్నది. ఇక ఆమె హాట్ అందాలు తనివితీరా చూడాలంటే వచ్చే నెల రిలీజ్ డేట్ దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











