షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన శ్రీయ, బాయ్ ఫ్రెండ్ తో పెళ్లైపోయింది, ఇంట్లోనే అంతా!

Recommended Video

ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన శ్రియ...!

సెక్సీ చూపుల భామ శ్రీయ శరన్ కు సౌత్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్లో ఎక్కువగా బడా స్టార్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీయనే. గత కొంతకాలంగా శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రీ కోచీవ్ తో రహస్య ప్రేమాయణం సాగిస్తోంది. పెళ్లిగురించి ప్రస్తావన తీసుకువస్తే పెళ్లి లేదు ప్రేమలేదు అంటూ తప్పించుకుతిరిగేది. తాజాగా శ్రీయ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రష్యన్ ప్రియుడిని తన నివాసంలోనే వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సౌత్ లో టాప్ హీరోయిన్

సౌత్ లో టాప్ హీరోయిన్

శ్రీయ శరన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా చాలా కాలం కొనసాగింది. శ్రీయ నటించిన పలు చిత్రాలు ఘానా విజయం సాధించాయి. ఇష్టం చిత్రంతో శ్రీయ టాలీవుడ్ కు పరిచయం అయింది. తక్కువ టైంలోనే శ్రీయ టాలీవుడ్ లో బడా హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా

స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా

అందం, అభినయం కలబోసి ఉండడంతో శ్రీయకు స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశం దక్కింది. టాలీవుడ్ లో శ్రీయ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా దాదాపుగా అందరు స్టార్ హీరోల చిత్రాలలో నటించి మెప్పించింది.

తమిళంలో కూడా హవా

తమిళంలో కూడా హవా

శ్రీయ తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన హవా కొనసాగించింది. రజినీకాంత్ సరసన శివాజీ చిత్రంలో నటించి మెప్పించింది.

రష్యన్ టెన్నిస్ ఆటగాడితో చాలా కాలంగా

రష్యన్ టెన్నిస్ ఆటగాడితో చాలా కాలంగా

శ్రీయ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ కోచీవ్ తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. శ్రీయ అతడితో సహజీవనం చేస్తున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి.

పెళ్లి గురించి అడిగితే

పెళ్లి గురించి అడిగితే

గత నెలలో శ్రీయ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి గురించి ప్రస్తావిస్తే అదేం లేదంటూ తప్పించుకుంది.

 ఊహించిన ట్విస్ట్

ఊహించిన ట్విస్ట్

పెళ్లి వార్తలని ఇటీవల ఖండించిన శ్రీయ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముంబై లోని తన నివాసంలో ప్రియుడిని రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.

సైలెంట్ ని బ్రేక్ చేసే అవకాశం

సైలెంట్ ని బ్రేక్ చేసే అవకాశం

తన పెళ్ళైన విషయాన్ని శ్రీయ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే శ్రీయ సోషల్ మీడియా ద్వారా తన వివాహ వార్తని అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది.

చివరి చిత్రం అదే

చివరి చిత్రం అదే

శ్రీయ తెలుగులో నటించిన చివరి చిత్రం పైసా వసూల్. బాలయ్య సరసన నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది. శ్రీయకు ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి తంతు పూర్తయిన నేపథ్యంలో శ్రీయ ఇక సినిమాల్లో నటిస్తుందా ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X