పబ్లిక్‌గా అతినితో ముద్దులాటలో మునిగిన శ్రీయ.. కెమెరాకు చిక్కడంతో!
సౌత్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది శ్రీయ శరణ్. టాలీవుడ్, కోలీవుడ్ అగ్రహీరోలందరి సరసన రొమాన్స్ చేసిన ఈ స్టార్ బ్యూటీ.. ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతోంది. పైగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తోంది. ఈ నేపథ్యం లోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అతినితో ప్రతీక్షణం ఎంజాయ్.. పబ్లిక్ డాన్సులు
లేటు వయసులో పెళ్లి చేసుకున్న శ్రీయ.. భర్త ఆండ్రీ కోస్చీవ్‌తో ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తోంది. షికార్లు కొడుతూ బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని డాన్సులేస్తూ ఫుల్ ఖుషీ చేస్తోంది. దీంతో ఈ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఆ నిర్మాత ఇంట్లో పార్టీ
ప్రస్తుతం దీపావళి సంబరాల్లో మునిగిపోయింది శ్రీయ. ఈ మేరకు భర్తతో కలిసి ముంబైకి వెళ్లిన ఆమె.. నిర్మాత రమేష్ తౌరానీ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్బంగా అందరు కలిసి ఘనంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం ఫోటోలకు పోజులిచ్చిన శ్రీయ, భర్తను ముద్దుల వర్షంలో ముంచెత్తింది.

పబ్లిక్‌గా.. అందరూ చూస్తుండగానే
లిఫ్ట్ ఎక్కడానికి వెళుతూ అందరూ చూస్తుండ గానే భర్తకు లిప్‌లాక్ ఇచ్చి షాకిచ్చింది శ్రీయ. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఈ ముద్దుల ఫోటోలు కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా పబ్లిక్‌గా ఇలా ముద్దులు పెట్టుకోవడమేంటని శ్రీయపై సెటైర్లు వేస్తున్నారు ఇవి చూసిన నెటిజన్లు.

దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ
పెళ్లయ్యాక కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు శ్రీయ. సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ సొగసులతో రెచ్చగొడుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషా దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ తిరిగి వెండితెర క్వీన్ కావాలని సిన్సియర్‌గా ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











