Don't Miss!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
శ్రీయా దొంగాట.. డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్.. గుట్టుగా పెళ్లి.. ఏన్నో అనుమానాలు..
గ్లామర్ స్టార్ శ్రీయా సరన్ పెళ్లి వార్త అన్ని పరిశ్రమల్లోనూ సంచలనం రేపింది. మార్చి 12వ తేదీన గుట్టుచప్పుడు కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకొన్నారనే వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే తన పెళ్లిపై శ్రీయ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అనుష్క, విరాట్ కోహ్లీలు ప్రేమించి పెళ్లిచేసుకొని.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారనే విషయాన్ని సినీవర్గాలు గుర్తు చేస్తున్నాయి.
మార్చి 11న విందు.. 12 పెళ్లి
జాతీయ మీడియా వెబ్సైట్ల కథనాల ప్రకారం.. మార్చి 11న శ్రీయా పెళ్లికి సంబంధించిన సంగీత్, మెహందీ కార్యక్రమాలు జరిగాయి. తొలుత శ్రీయా వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతుంది అని ప్రచారం చేశారు. కానీ శ్రీయా సరన్ వివాహం ముంబైలోని తన లోఖండ్వాలా నివాసంలో మార్చి 12న మీడియా కంటపడకుండా జరిగింది.
మంచు విష్ణు కన్ఫర్మేషన్
ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన పెళ్లికి క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కొంత మందే హాజరయ్యారు. శ్రీయా నివాసానికి పక్కనే ఉండే హీరో మనోజ్ బాజ్‌పేయ్, ఆయన సతీమణి షబానా లాంటి కొందరు మాత్రమే హాజరయ్యారు అని మంచు విష్ణు వెల్లడించినట్టు పేర్కొన్నారు.
రష్యా వ్యాపారవేత్త.. క్రీడాకారుడు
శ్రీయా సరన్ బాయ్‌ఫ్రెండ్ అండ్రి కృశ్చీవ్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. అంతేకాకుండా ఆ దేశం తరఫున జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ కూడా. అతనికి రెస్టారెంట్ల వ్యాపారం ఉంది. 2015లో యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకొన్నారు.
ఏడేళ్లుగా అఫైర్
గత ఏడేళ్లుగా అండ్రి కృశ్చేవ్, శ్రీయా మధ్య అఫైర్ కొనసాగుతున్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధించిన సమాచారాన్ని శ్రీయా అందజేస్తున్నారు. కానీ తన సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయకపోవడం గమనార్హం.
అనేక అనుమానాలు, సందేహాలు
శ్రీయా, అండ్రి కృశ్చీవ్ పెళ్లి చేసుకొన్నారని జాతీయ మీడియా కోడైకూస్తున్నప్పటికీ.. ఆమె మాత్రం పెదవి విప్పడం లేదు. తన పెళ్లి గురించి బాహ్య ప్రపంచానికి దాచడంపై మీడియా సంస్థలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీయా సరన్ సినిమాలు..
పెళ్లి విషయం పక్కన పెడితే, శ్రీయా సరన్ ప్రస్తుతం తెలుగులో వీరభోగ వసంతరాయలు చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో శ్రీయాతోపాటు శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా తమిళంలో నరకాసురుడు అనే చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి నటిస్తున్నది.