twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌతమిపుత్ర శాతకర్ణి: వశిష్టి దేవిగా శ్రీయ లుక్ సూపర్బ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ట్రీజియ‌స్ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో హీరోయిన్ గా శ్రీయ నటిస్తోంది. శాతకర్ణి భార్య వైశిష్టి దేవిగా ఆమె నటిస్తోంది.

    నేడు శ్రీ పుట్టినరోజు. నేడు ఆమె 34వ వసంతంలోకి అడుగు పెడుతోంది. శ్రీయ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమెకు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రేయాశ‌ర‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 6న రాజ‌సూయ‌యాగం చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. అఖండ భార‌తాన్ని ఏక‌తాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వ‌హించారు.

    శ్రీయ పుట్టినరోజు విశేషాల్లోకి వెళితే... ఆమె శ్రియ దిల్లీలోని హరిద్వార్‌ లో పుట్టి పెరిగారు. వాళ్ల నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పనిచేసేవారు. అమ్మ ఉపాధ్యాయురాలు. కథక్‌ నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే శ్రియకు నృత్యం పట్ల ఆసక్తి ఉందని తెలుసుకున్న వాళ్ల అమ్మ సొంతంగా డ్యాన్స్‌ పాఠాలు నేర్పారు. ఇలా ఓ పక్క డ్యాన్స్‌ ప్రాక్టీస్‌, మరోపక్క చదువుకొనసాగిస్తున్న శ్రియ సినిమాల్లో అవకాశం రావడంతో ఈ రంగం వైపు అడుగులు వేసింది.

    ఇష్టం సినిమా ద్వారా

    ఇష్టం సినిమా ద్వారా

    శ్రియ నటించిన ‘చల్తీ క్యూ హవా' మ్యూజిక్‌ వీడియోను చూసిన దర్శకులు విక్రమ్‌, రాజ్‌ 2001లో ‘ఇష్టం' సినిమా ద్వారా ఆమెను పరిచయం చేసారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి పిలుపు వచ్చింది. ‘సంతోషం' సినిమాలో అవకాశం దక్కించుకుంది.

    స్టార్ హీరోలతో కలిసి...

    స్టార్ హీరోలతో కలిసి...

    తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. రజనీకాంత్‌, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ వంటి అగ్ర కథానాయకులతో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. అయితే కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు అకాశాలు కాస్త తగ్గాయి.

    16 సంవత్సరాల కెరీర్

    16 సంవత్సరాల కెరీర్

    ఇష్టం సినిమాతో కథానాయికగా ప్రారంభమైన‌ శ్రీయ శరణ్ ఇప్పటికి 16 సంవత్సరాల కెరీర్ ని సాగించింది. ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించింది.

    14 ఏళ్ల వయసులోనే

    14 ఏళ్ల వయసులోనే

    శ్రీయ తండ్రి పుష్పిందర్ శరణ్ బిహెచ్ ఇఎల్ లో సివిల్ ఇంజినీర్ మమ్మీ కెమిస్ట్రీ టీచర్. ముంబై లో ఉండేవారు. సోవన నారాయణ్ తన గురువు. అక్కడే కథక్ నేర్చుకుంది. 14వయసులోనే కథక్ నేర్చుకోవడానికి సోవన నారాయణ్ వద్దకు వెళ్లి తనని ఇంప్రెస్ చేసి విద్యార్థినిగా చేరింది.

    మరిన్ని విశేషాలు..

    మరిన్ని విశేషాలు..

    ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అకమడమిక్ స్టడీస్ కి చేరింది. అసలు సినీకెరీర్ లో ఎలా ప్రవేశింది అంటే.. వారణాసిలో ఎవరో మ్యూజిక్ వీడియో తీస్తుంటే వెళ్లమని గురువుగారు సజెస్ట్ చేశారు.

    అవకాశం వచ్చింది ఇలా...

    అవకాశం వచ్చింది ఇలా...

    అలా ఆ వీడియోలో నటించి యూట్యూబ్ లో పాపులర్ అయ్యింది. అది తెలుగులో ఓ దర్శకుడు చూసి ఇష్టం సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. ఇన్నేళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్ ని కొనసాగించిన శ్రీయ ఇప్పటికి వన్నె తరగని శిరులతో యువతరాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. '

    English summary
    Bollywood actress Shriya Saran turns 34 today. The popular actress down down south, has also made a name for herself in Bollywood and the Fashion industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X