షాకిచ్చిన శ్రీయ.. రష్యన్ బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి!
శ్రీయ శరన్ షాకిచ్చింది. నిన్న మొన్నటి వరకు పెళ్లి ఊసే ఎత్తని ఈ మత్తు చూపుల సుందరి రష్యన్ వ్యక్తికి పడిపోయింది. అతి త్వరలోనేశ్రీయ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. శ్రీయ శరన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ లో పేరుగాంచి బడా స్టార్ లందరితోను శ్రీయ నటించింది. ఈ 35 ఏళ్ల బ్యూటీ ఎట్టకేలకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏంటా రష్యన్ వ్యక్తి సంగతి
శ్రీయ శరన్ కొద్దిరోజుల క్రితమే ఓ రష్యన్ వ్యక్తితో ప్రేమలో పడడం వెంటనే రిలేషన్ షిప్ మొదలు పెట్టేయడం చక చకా జరిపిగిపోయాయట. ప్రస్తుతం శ్రీయ తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రష్యాకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ కుటుంబాన్ని కలిసేందుకు ఈ భామ రష్యా వెళ్లిందట. పెళ్లి కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు వెళ్లినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Recommended Video


పెళ్లి ఇండియాలోనే
శ్రీయ వివాహం ఇండియాలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో వివాహతంతు ముగించాలని శ్రీయ నిర్ణచుకుందని సమాచారం.

సౌత్ స్టార్స్ అందరితో రొమాన్స్
శ్రీయ శరన్ సౌత్ లో దాదాపుగా అందరి హీరోల సరసన నటించింది. రజినీకాంత్, చిరంజీవి మరియు బాలయ్య వంటి సీనియర్లతో ఆడిపాడింది. మహేష్, పవన్ వంటి హీరోలకు సైతం హీరోయిన్ గా మారింది.

తగ్గిన అవకాశాలు
శ్రీయ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గత 18 ఏళ్లుగా శ్రీయ సౌత్ సినిమాలలో నటిస్తోంది. కాగా ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడడమే దీనికి ప్రధాన కారణం. అవకాశాలు తగ్గుదల వలన శ్రీయ పెళ్లి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











