ఫామ్ లో ఉన్నంత వరకే..ఫెయిల్యూర్ వస్తే మొహం కూడా చూడరు...
తెలుగులో సినిమాలు లేక ఖాళీగా వున్న డిల్లీ సోయగం శ్రియా అనుభవం ద్వారా ఇప్పుడు ఎంతో నేర్చుకుందట. 'సక్సెస్ ఉంటేనే ఎవరైనా మనల్ని పట్టించుకుంటారు. లేకపోతే ఎవరూ పట్టించుకోరు' అంటూ వేదాంతం కూడా చెబుతోంది. 'సినిమా సక్సెస్, ఫెయిల్యుర్లతో హీరోయిన్ కి ఏమాత్రం సంబంధం లేకపోయినా, వాటి ప్రభావం మాత్రం ఎక్కువగా పడేది హీరోయిన్ మీదే' అంటోంది. 'ఇక్కడ ఫామ్ లో ఉన్నంత వరకే ఎవరికైనా గౌరవం. ఫెయిల్యూర్ వస్తే కనుక ఇక మన మొహం కూడా ఎవరూ చూడరు. అందుకే, ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. ఒక సినిమా ఒప్పుకునే ముందు ఎన్నో అంశాలు చూస్తున్నాను' అని చెబుతోంది శ్రియా.
అయితే, అసలు ఆఫర్లే లేనప్పుడు ఇంత సీను ఆమెకెక్కడిది? అంటున్నారు టాలీవుడ్ జనం. 'వస్తే కనుక ముందూ వెనుకా చూడకుండా ఒప్పుకుంటుంది. అందుకు ఈమధ్య తను సైన్ చేసిన అల్లరి నరేష్ సినిమానే ఓ ఉదాహరణ' అంటున్నారు!


Click it and Unblock the Notifications











