శ్రియకు పెళ్లితో పనిలేకుండానే లాగించేస్తోందా?
శ్రియకు పెళ్ళి వయస్సు వచ్చేసిందని,మరి కొద్ది రోజుల్లో దాటిపోతుందని ఆమె అమ్మా,నాన్నా కంగారుగా సంభందాలు చూసేద్దామని నిర్ణయించుకున్నారుట. అయితే శ్రేయ మాత్రం ఎప్పటిలాగే అప్పుడే నాకు పెళ్ళేమిటి..ఆ టైమ్ వచ్చినప్పుడు నేనే చెప్తాను అని సమాధానమిచ్చిందిట. ఈ విషయం ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ..మన సంప్రదాయ విలువలను నేను గౌరవిస్తాను. అందులో భాగమైన 'పెళ్లి' అంటే నాకెంతో గౌరవం. కానీ..ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎప్పుడు చేసుకుంటానో కూడా చెప్పలేను. ప్రస్తుతం నా ఆలోచన మొత్తం కెరీర్‌పైనే. సినిమా రంగంలోనే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని కోరికలు, మరికొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి. అవన్నీ నెరవేరిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా. అవి నెరవేరాలంటే...కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అని సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది. అయితే శ్రియకు ఓ తెలుగు హీరోతో బాగా దగ్గర సంభందం ఉందని, అలాంటి స్ధితిలో ఆమెకి పెళ్ళిగురించి ఆలోచించే అవసరం ఏముందని ఆ పత్రిక ప్రశ్నిస్తూ రాసుకొచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే మన లీడర్ రాణానే అంటున్నారు.


Click it and Unblock the Notifications











