»   » ఎనభై ఏళ్ళ క్రితం శ్రియ...ఇలా ఉండేది(ఫోటో)

ఎనభై ఏళ్ళ క్రితం శ్రియ...ఇలా ఉండేది(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గెటప్ లు ఛేంజ్ చేయకపోతే ఫేడవుట్ అయిన హీరో, హీరోయిన్స్ ను చూడటం లేదు. అందుకేనేమో హాట్ గా ఉండే శ్రియ..ఎనభై సంవత్సాల క్రితం ఉండే స్త్రీల గెటప్ లోకి మారింది. మీరు చూస్తున్న ఈ లుక్ అక్కినేని మల్టి స్టారర్ 'మనం'చిత్రంలోనిది. 1920 ప్రాంతంలో ఈ కథ ప్రారంభమవుతుందని సమాచారం. అందుకోసం ఆమెను ఇలా మేకప్ చేసారని సమాచారం. 'మనం' చిత్రం 1920 నుంచి 2013 మధ్య జరుగుతుంది. మార్చి 31 న ఈ చిత్రం విడుదల కానుంది.

శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..' నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.

Shriya stunning looks for Manam

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావుగారొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary

 As per the ‘Manam’ plot of the movie all lead characters will be seen in modern and retro avatars and here is retro look of Shriya in Manam. The actress is looking odd in ordinary costumes. Sported bindi, Shriya looks like very ordinary woman and all credit goes to the makeup artist .
Please Wait while comments are loading...