»   » ఏదో విధంగా మీడియాలో కనపడాలేనే శ్రియ అలా..

ఏదో విధంగా మీడియాలో కనపడాలేనే శ్రియ అలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన స్టార్ డమ్ ని కోల్పోయిన శ్రియ తనని జనం మర్చిపోకుండా ఉండేందుకు కానూ ఎప్పుడూ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడలని ఫిక్సై నట్లుంది. రెండు రోజుల క్రితమే త్రాగుడు గురించి లెక్చర్స్ దంచిన శ్రియ ఇప్పుడు నవ్వు గురించి మాటలు చెప్తోంది. ఈ మధ్య లాఫింగ్ క్లబ్‌లో చేరినప్పటి నుంచి తనకు నిత్యం ఆనందంగా ఉంటోందని, అనారోగ్యం కూడా దూరమవుతోందని చెప్తోంది. అందుకే అందరూ నవ్వుని ప్రేమించాలనీ, నవ్వుకు మించిన మందు మరొకటి లేదనీ కనపడ్డ మీడియా వారికి చెప్పి నవ్విస్తోంది.అదేంటి హఠాత్తుగా ఈ నవ్వుల గోల అంటే...చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాల్సిందే కదా. ఆరోగ్యం చక్కగా ఉంటే ఎప్పటికైనా మరో రెండు సినిమాలు మన ఖాతాలో చేరతాయని చెప్పుకొచ్చింది. ఇది విన్న వారు శ్రియ పాపం ప్రొద్దున్నే ఈ రోజు మీడియా వద్ద ఏమి మాట్లాడాలో అని టాపిక్ వెతుక్కుంటూంది అంటున్నారు.

English summary
Shriya no demand in films is talking too much about Laughing. She says always prefers Laughing therapy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu