శ్రుతిహాసన్ ఆరోగ్య పరిస్ధితి ఏమిటి
హైదరాబాద్: శ్రుతిహాసన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్స్ చెప్పారు. పూర్తి టెస్ట్ లు చేసి ట్రీట్ మెంట్ ఇచ్చామని అన్నారు. పూర్తిగా శృతి ఆరోగ్యం ఇంప్రూవ్ అయితే ఈ రోజు(మంగళవారం) సాయింత్రం డిశార్జ్ చేస్తారని చెప్పారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్ తిరిగి వెళ్తుండగా కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కడుపునొప్పికి కారణం అపెండిసైటిస్‌గా వైద్యులు నిర్థారించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.
శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేసిన 'ఎవడు' సినిమాని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. సినిమా ప్రత్యేక ప్రచార చిత్రాన్ని ఈ నెల 3న విడుదల చేసారు. కొత్త టీజర్ తో మళ్ళీ క్రేజ్ వచ్చింది.
''బతికితే ఆశలు... పోతే ప్రాణాలు అనుకునే తత్వం ఉన్న యువకుడి కథ ఇది. రామ్‌చరణ్ ...నాయకుడి పాత్రలో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది'' అన్నారు నిర్మాత. కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్‌సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. నూతన సంవత్సరం సందర్భంగా బీజియంతో కూడిన కొత్త టీజర్‌ని మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications












