రామ్ చరణ్‌తో మరోసారి శృతి హాసన్, డీటేల్స్...
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటికే 'ఎవడు' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ మరోసారి తెరపై జోడీ కట్టబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబర్లో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో చరణ్‌ను కొత్త లుక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఇందు కోసం బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ సమీర్ జౌరాను రప్పించారు. జులై చివరి వారం నుండి నాలుగైదు నెలల పాటు అతని సమక్షంలో రామ్ చరణ్ ఫిట్ నెస్ శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది.

సమీర్ జౌరా ముంబైకి చెందిన ఫిట్ నెస్ ట్రైనర్. హృతిక్ రోషన్, ఫరాన్ అక్తర్, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ టాప్ స్టార్లకు ఆయన ఫిట్ నెస్ శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే సమీర్ జౌరా హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. శిక్షణ కాలంలో రామ్ చరణ్ ప్రత్యేకమైన డైట్ తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు.
గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకీ పార్టు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











